రాష్ట్ర మహిళా బీసీ నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తణుకు అమే స్వగృహంలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాంలో పాల్గొని తణుకు శాసనసభ్యులు 15 మంది కళాకారులకు దుస్తులు, పళ్ళు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో పేదల అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవికి తణుకు నియోజకవర్గానికి చెందిన టి.డి.పి నాయకులు, కార్యకర్తలు రాజకీయనాయకులు, లయన్స్ క్లబ్ నాయకులు అభిమానులు పుష్పగుచ్ఛం లతో శాలువాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ లు పరిమి వెంకన్న బాబు, దోమ్మేటి సుధాకర్, కలగర వెంకట కృష్ణ, మంత్రిరావు బాబు, బసవా రామకృష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవీ, టౌన్ అధ్యక్షుడు నాగరాజు, జనసేనా టౌన్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, మహిళా అధ్యక్షురాలు విజయ, తమరాపు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్స్ తామరాపు పల్లపురావు , తాతపూడి మారుతీరావు, గుమళ్ళ హనుమంతు, చిట్టిపాప, కె.రమాదేవి, నాయుడు లావణ్య, బంటువల్లి లక్ష్మి, కె.వి.ఆంజనేయులు, కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాస్, కోడూరి సత్యనారాయణ, డాక్టర్ రామబ్రహ్మం, డాక్టర్ వత్సవాయి రాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఇందిరా, జిల్లా బిసి అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, మట్టా వెంకట్, గమిని రాము, ఓమ్మి రాంబాబు, సన్యాసిరావు మాదిరెడ్డి శ్రీనివాస్, కృష్ణకుమారి, ఆకుల ప్రసాద్, కాళి సత్తిబాబు తదితరులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా రైల్వేస్టేషన్ రోడ్డులో వున్న అంబనాంబ ఆశ్రమం నందు మరో సేవా కార్యక్రమంలో మహిళలకు
బట్టలు, పళ్ళు, 50 కేజీల బియ్యం, కాయగూరలు, 3000రూపాయిల నగదు, అనంతరం వారికి భోజనాలు శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు కొరిపల్లి సత్యనారాయణ, కె.సుశీల, అల్లూరి కరుణాకర్ చౌదరి, బి.వెంకట రమణ, బి.లక్ష్మి, కె.శ్యామల, కె.జ్యోతి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం కొండాలమ్మ రోడ్డులో వున్న యానాదుల పుంత వద్ద ఉన్న నిరుపేదలకు ఆహారం పంపిణీ చేసారు.
ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు వావిలాల సరళాదేవి అభిమానులు 15మంది రక్తదానం చేయగా ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు శ్రీ మాదిరెడ్డి బాబుజీరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
సంకు మనోరమ, వర్మ దంపతులు, సప్పారాజు తదితరులు స్నేహితుల దినోత్సవం మహిళలతో కలిసి నిర్వహించారు.
