విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్)
స్నేహితులు దినోత్సవం పురస్కరించుకొని 29 వ వార్డులో కీలాని అప్పారావు, గుమ్మడి శ్రీను మిత్రబృందం ఆధ్వర్యంలో ఎస్డివైసీసీ సీనియర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
అనంతరం పరిచయ కార్యక్రమం చేసుకొని క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమం తలపెట్టిన ఎస్డివైసీసీ క్లబ్ సీనియర్స్ కిలాని అప్పారావు, గుమ్మడి శ్రీను కి అభినందనలు తెలిపారు అనంతరం యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే కాకుండా క్రీడల్లో పాల్గొనటం వలన మానసిక,శారీరక ఉల్లాసం లభిస్తుంది అని స్నేహితుల అందరూ కలిసి ఇలా కలుసుకోవడం వలన గత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ సరదాగా గడపటం మంచి అనుభూతుల్ని ఇస్తుందని ఆనందం వ్యక్తంచేశారు. 29వ వార్డ్ లో ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టిన తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుంది అని హర్షం వ్యక్తం చేశారు.