తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ అమరావతి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ముస్కాన్ ఎడ్యుకామ్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన ఈ అంతరిక్ష శిక్షణా కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష, ముస్కాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అంతరిక్ష విద్య అభ్యాస ఆధారిత శిక్షణ నైపుణ్యాల అభివృద్ధి, అంతరిక్ష విద్యపై ఆసక్తిని ప్రేరేపించుట గ్లోబలైజేషన్, వృత్తి అవకాశాలపై అవగాహనను ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు, ముఖ్యంగా అంతరిక్ష విద్య, సోలార్ విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. అభ్యాస అధారిత శిక్షణ కోసం ముంబాయి, ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే నిపుణులను తీసుకువచ్చి వారిచేత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇస్రో, నాసా వంటి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగాల సాధనకు ఇదొక నాంది అన్నారు. సునీత విలియమ్స్, సుభాష్ శుక్లా వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాలకొల్లుకు చెందిన జాహ్నవి అంతరిక్షం వెళ్లబోతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనపై జరుగుతున్న అధ్యయనాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సిటీ సీఈవో వెంకటేశ్వర్లు, ముస్కాన్ డైరెక్టర్ డాక్టర్లు విఠల్, ప్రణీష్, గోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి, తణుకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కే మురళి సత్యనారాయణ, జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇవివి ఎస్ఎస్ఎస్ బిఎల్ నారాయణ, ఏపీసి శ్రీ శ్యామ్ సుందర్, భీమవరం డివైఈవో ఎన్.రమేష్, మండల విద్యాధికారి నెంబర్ 2 జిబివి ప్రసాద్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎం. వెంకటలక్ష్మి, తణుకు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వి. గంగయ్య, తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు మంత్రి రావు వెంకటరత్నం, తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, టిడిపి నాయకులు తమరాపు సత్యనారాయణ, గుమ్మళ్ళ హనుమంతు పేరెంట్స్ కమిటీ మెంబర్ తాతపూడి మారుతీ రావు టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.