4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాలులో. ది 8.3.2025 (రెండవ శనివారము) జరుగు జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులతో మీటింగు ఏర్పాటుచేసి రాజీ పడు ప్రతి కేసు రాజీచెయ్యాలని, అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి లోక్ అదాలత్ ల యొక్క ప్రయోజనాలు తెలియచెయ్యాలని, కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలుపుతూ, కేసులు వున్న ప్రతి ఒక్కరు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడు క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, కుటుంబ తగాదాకేసులు, అన్నిరకముల సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు మరియు ప్రి లిటిగేషన్ కేసులుగా టెలిఫోన్, మరియు బ్యాంక్ బకాయి కేసులు రాజిచేసుకోవచ్చని తెలుపుతూ, ది 8.3.2025 వ తేదీన ఉమ్మడిగోదావరి జిల్లాలలో పాటు రాష్ట్రం లో కోర్టులు పనిచేయు ప్రతి చోటా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని , దానినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె.కృష్ణ సత్యలత మరియు స్పెషల్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, ఈ కార్యక్రమంలో తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
