భారత రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కులను కాలరాసే క్రమంలో ఎస్సీ ఎస్టీలపై ఏ ఒక్క ఆదిపత్య కులం అహంకారంతో కూడిన వ్యక్తులు గాని అధికారులు గాని వివక్షత చూపించిన వారిని రాజ్యాంగం చూపించిన మార్గం ద్వారా శిక్షించే వరకు పోరాడుతామని భీమ్ సేన వార్ అధ్యక్షుడు కొరమాటి చిన్నారావు అన్నారు. ఈరోజు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో అధ్యక్షుడు చిన్నారావు మాట్లాడుతూ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరి 18వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన తోటి ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి దళిత యువతి (మాదిగ) సుష్మాని కులం పేరుతో దూషించడమే కాకుండా ఆమెపై భౌతిక దాడికి పాల్పడిన సంగతి
మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై భీమ్ సేన వార్, విశాఖపట్నం వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో సమస్య గురించి మాట్లాడి డాక్టర్ ఝాన్సీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించడం జరిగింది.ఈ సంఘటన పై సంబంధిత ఉన్నతాధికారులు ఇరువురుని సెలవు పెట్టమని ఆదేశించిన బాధితురాలైన సుష్మ మాత్రమే సెలవులోకి వెళ్ళింది గాని డాక్టర్ ఝాన్సీ ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ విధులు కొనసాగిస్తున్న క్రమంలో ఈ విషయాన్ని ఈ నెల 11 న సెక్రటేరియట్ లో సంబంధిత వైద్యశాఖమాత్యులు సత్యకుమార్ యాదవ్ ని మరియు ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు కూడా డాక్టర్ ఝాన్సీ గారి రాజకీయ, ఆర్ధిక, సామాజిక ఒత్తిడికి తలొగ్గినట్లు అనిపిస్తుంది. పోలీసు వారు తూ తూ మంత్రంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ విషయంలో డాక్టర్ ఝాన్సీని అరెస్ట్ లేదా సస్పెండ్ చేయడం కాకుంటే
ఆ ప్లేస్ నుండి తొలిగించడం ద్వారా బాధితురాలు సుష్మకి కనీసన్యాయం చేయవచ్చు అని కాబట్టి ఈ విషయంలో అధికారులు తాత్సారం చేసుకుంటే వెళ్ళితే భీమ్ సేన వార్ ఈ సమస్య పై మిగిలిన దళిత సంఘాలు అన్నింటినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా తన దగ్గర పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా తన ఆధిపత్య కులదురహంకారంతో చాలా ఇబ్బంది పెడుతూ వారిపై వివక్షత చూపుతూ తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందన్న విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకి ఫిర్యాదు రూపంలో ఇచ్చినా ఇంతవరకు అధికారులు కూడా ఎటువంటి న్యాయం చేయడం లేదని బాధితరాలు సుష్మ సంఘ సభ్యులుతో తెలియజేసుకుంటూ ఆవేదన చెందారు. అదే డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్ యునాని స్పెసలైజేషన్ 2008 లో ప్రొహిబిషన్ కంప్లీట్ అయ్యి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ అవ్వాల్సిన సీనియార్టీ లిస్టులో మొదటి వ్యక్తిని పరిగణనలోకి తీసుకోకుండా 2022లో ప్రొబిషన్ కంప్లీట్ అయిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి ని జోన్ 1 డిప్యూటీ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఆయుర్వేద సీనియర్ లిస్టులో ఐదో వ్యక్తి అని తెలిసింది. దళిత డాక్టర్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టినా అతడి కాండిడేచర్ ని కమిషనరేట్లో అలాగే సెక్రటేరియట్లోనూ ప్రక్కనపెట్టి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయిని ఎఫ్ఎసి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్గా అపాయింట్ చేశారు.
డిప్యూటీ డైరెక్టర్ అపాయింట్మెంట్లో2: 1: 1 రేషియో నీ పాటించటం లేదు. అంటే ఒక పోస్ట్ ఆయుర్వేదం ఒక పోస్ట్ హోమియోపతి ఒక పోస్ట్ యునాని స్పెషలైజేషన్ ప్రకారం, నాలుగు జోన్లో రీజినల్ డిప్యూటీ డైరెక్టర్లుగా అపాయింట్ చేయాలని తెలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు జోన్ లో కూడా ఆయుర్వేదం స్పెషలైజేషన్ డాక్టర్లను అపాయింట్ చేశారు. దళిత మెడికల్ డాక్టర్ యునాని స్పెషలిస్ట్, యునాని స్పెషలిస్ట్ అయన ఆయన మెరిట్ లిస్టులో ఫస్ట్ ఉన్న కాండిడేట్ అని, ఆయనని కాదని లిస్టులో ఆయుర్వేద సీనియర్ లిస్టులో క్రిందనున్నటువంటి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయిని అపాయింట్ చేశారని తెలిసింది. 2020-21 ప్యానల్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ రికమెండ్ చేసిన ప్రకారంగా ఇద్దరికీ ఆయుర్వేద స్పెషలైజేషన్ నుండి జోన్-3 లో ఒకరిని జోన్-2 లో ఒకరిని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా అపాయింట్ చేశారని, అలాగే జోన్-1 లో యునాని స్పెసలైజేషన్ కి జోన్-4 లో హోమియోపతి స్పెషలైజేషన్ కి ఇచ్చారని, అలా రోస్టర్ రూల్ పాటించారని తెలిసింది, కానీ ఇప్పుడు జూనియర్ అయినా డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి కొరకు ఈ రూలును ఉద్దేశపూర్వకంగా మార్పుచేసి యునాని సీనియర్ను ప్రక్కనపెట్టి (అతను దళితుడు కాబట్టి), ఆయుర్వేద నుండి ఆల్రెడీ ముగ్గురు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్లు ఉండగా మరల అదే ఆయుర్వేద స్పెషలైజేషన్ నుంచి మెరిట్ లిస్టులో ఐదో నెంబర్ లో ఉన్న డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి ని జోన్-1 లో అపాయింట్ చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో కలగజేసుకొని న్యాయం చేయవలసిందని సంబంధిత ఉన్నతాధికారులకి తెలియజేసి ఉన్నామని కాబట్టి వెంటనే దీనిపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని సంఘ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వి వి దుర్గారావు, బల్లంకి కనకరాజు, రేణుకుమార్, రవికుమార్, నాంచారయ్య, బాలక్రిష్ణ పాల్గొన్నారు.
