స్థాండింగ్ కమిటి ఎన్నికలో క్రాస్ వాటింగ్ పై మండిపడ్డ మహ్మద్ సాదిక్

విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్)

తాజాగా జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 9 సీట్లు గెలిచి మరోసారి ప్రజల విశ్వాసం చురగొన్నామని 39వార్డు కార్పొరేటర్ మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మహ్మద్ సాదిక్ అన్నారు. ఆశీలమీట్ట లో గల హోటల్ మేఘాలయ లో జరిగిన ప్రెస్ మీట్ లో సాదిక్ మాట్లాడుతూ నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నిలో కూటమి బలపర్చిన సీట్లలో 9 గెలిచికుందని ఒక్క సిటు గెలుచుకున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అలాగేయ్ జరిగిన పరిస్థితిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్‌లో పాల్గొనడం పై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడ కనబడలేదు గాని కేవలం ఇటీవల మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక కొంతమంది కార్పొరేటర్ లు తమ అసంతృప్తిని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వ్యక్తం చేసే చర్య గా చూడాలన్నారు. ఇది పూర్తిగా మేయర్‌కు వ్యతిరేకమైన ఓటు గా మాత్రమే చూడాలి గాని వైసిపి నేతలు మాట్లాడ్తున్నట్లు కూటమి ప్రభుత్వ పనితీరు లేదా విధానాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మేయర్ ఎన్నికకు ముందు, ఆయన కార్పొరేటర్లతో సమన్వయంగా పనిచేస్తూ, అందరికీ అభివృద్ధి కార్యక్రమాల్లో సంపూర్ణ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, మేయర్‌గా ఎన్నికైన తర్వాత, ఆయన వైఖరిలో మార్పు కనిపించింది అదేవిధంగా కార్పొరేటర్లతో సరిగా సమన్వయం చేయలేకపోతున్నారు. మేయర్ అహంకారం ధోరణిలో ప్రవర్తన కలిగిఉండటం కార్పొరేటర్ లు తమ సమస్యలు చెబితే పట్టించుకోకుండా తమ సొంత నిర్ణయం ప్రకారం మేయర్ పనితీరు ఉంటుందని తెలిపారు. మేయర్‌గా ఎన్నికైన తర్వాత జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో, మేయర్ తన సోదరుడు పీలా గోవింద్‌ను కౌన్సిల్‌కు తీసుకువచ్చారని మున్సిపల్ చట్టాల ప్రకారం, నిపుణుల సలహా కోసం ఎవరినైనా కౌన్సిల్‌కు ఆహ్వానించాలంటే, ముందుగా కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించి, ఆ విషయాన్ని ప్రభుత్వానికి పంపించాలి. అయితే, ఈ సందర్భంలో అటువంటి విధానం పాటించలేదు, ఇది చట్ట విరుద్ధం మరియు అనైతికం. ఇటువంటి సందర్భాలలో, జీవీఎంసీ సమస్యలను చర్చించడానికి మొదట ఆహ్వానించబడవలసిన వ్యక్తి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్, కానీ మేయర్ తన సోదరుడిని తీసుకురావడం సముచితం కాదని కార్పొరేటర్లు భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొందరి కార్పొరేటర్ లలో అసంతృప్తి బహిరంగంగా గానే వ్యక్తం చేసినప్పటికీ మేయర్ లో మార్పు రాలేదు అన్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన 22 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారన్నా అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్నారు. ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంతర్గత విషయం మాత్రమే మరియు కూటమి ప్రభుత్వంపై ఎటువంటి అసంతృప్తి ప్రజల్లో లేదని ఎవరైతో క్రాస్ ఓటింగ్ కి పాలబడ్డారో ఆ కార్పొరేటర్ లతో మాట్లాడి తమకు ఉన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి చర్చించి, పార్టీ పెద్దల దృష్టిలో పెడతాం అన్నారు. ఇప్పటికే వైసిపిని ప్రజలు చికొట్టిన వారిలో మార్పు రాలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం బలంగా, ఐక్యంగా ఉందని గ్రేటర్ విశాఖపట్నం అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటుంది అని పేర్కొన్నారు

Scroll to Top
Share via
Copy link