సోమవారం మార్చి 24 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ – కలెక్టర్ పి.ప్రశాంతి

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 24 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేశారు.

Scroll to Top
Share via
Copy link