ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ – తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని, ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ…

ప్రపంచవ్యాప్తంగా పవిత్రతతో చేసుకునే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ముందుగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ…

రంజాన్ అంటే త్యాగానికి ప్రతీక..
కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఇఫ్తార్ విందు జరుగుతున్న నేపథ్యంలో.. ఎంతో భక్తిశ్రద్ధలతో 14 గంటల పాటు ఏమి మంచినీరు కూడా ముట్టకుండా టాబ్లెట్లు కూడా వేసుకోకుండా భగవంతుని సపోర్టు తో మనం సజీవులుగా నిలబడుతున్నామని రంజాన్ మాసం తెలియజేస్తుంది.

ఈ సందర్భంగా ఈ మాసంలో 300 మంది పేద ముస్లింలకు బియ్యము, నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగిందని, మీతో పాటు కష్ట సుఖాల్లో ఉండటానికి ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించారు ఈ పదవి ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను.. మీతో కలిసి ప్రయాణం చేస్తాను..

2014 లో మసీదుకు పన్ను రద్దు చేసాం ..కౌన్సిల్ తీర్మానం చేశాం.
చాలా సంవత్సరాల వరకు మీకు ఎలాంటి రసీదులు రావట్లేదు కానీ ఈ మధ్యకాలంలో రసీదులు వస్తున్నాయని తెలిసింది. దీని గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు.

ఈ విషయంపై కమిషనర్ తో నేను చర్చించాను.. కచ్చితంగా దానిని రద్దు చేస్తాను.

ఈ విషయంలో మీరేమీ పన్ను చెల్లించిన అవసరం లేదు.. ఆరోజు కౌన్సిల్ తీర్మానం జరిగిన తరువాత కంప్యూటర్ లో అది యాడ్ చేయాల్సింది అధికారులు బాధ్యత.. వారి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మరల నోటీసులు మీకు రావడం జరుగుతుంది.. ఇకమీదట నోటీసులు రాకుండా నేను బాధ్యత తీసుకుంటాను..

అలానే మదర్సా ప్రారంభించడం జరిగింది ఈ విషయంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా దీన్ని మీరు నిర్మించుకోవచ్చు ఇందులో భాగంగా నేను మాట ఇచ్చిన ప్రకారం 50 వేల రూపాయలు ఇప్పుడే నేను అందిస్తాను

ముఖ్యంగా ముస్లిం సోదరులు తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం కష్టపడి వెట్టి చాకిరి చేసే పని వారికి పిత్రార్జితంగా మనం ఇవ్వకూడదు వారిని కష్టపడి చదివించండి వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకునే రీతిగా ఉండేలాగా వారిని తీర్చిదిద్దాలని.. ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది దాని సద్వినిగం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనకు, తెదేపాకు మీరు సపోర్ట్ చేయండి

మరి ముఖ్యంగా మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలో అయినా సరే నా గడప తలుపు తట్టండి . నేను మీకు సహాయం చేస్తాను

.వర్తనపల్లి కాశి. పుల్ల బాబి. అడపా ప్రసాదు. పైబోయిన వెంకటరామయ్య. అడ్డ గర్ల సురేష్. గుండుమోగుల సురేష్.. పిడుగు మోహన్ రావు. చాపల రమేష్. అడబాల మురళి. పాలూరి వెంకటేశ్వరరావు. నల్లగంచి రాంబాబు. సందక రమణ. ములపాక చిట్టి. పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link