నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బూరుగుపల్లి శేషారావు తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా నాయకులుగా కొనసాగుతున్న వారిని శేషారావు జ్ఞాపికలతో సత్కరించారు. ఈసందర్భంగా శేషారావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీరామారావని కొనియాడారు.
