ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉండ్రాజవరం నందు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకి మార్బిడిటి మేనజెమెంట్ కిట్స్ వైద్యాధికారి డాక్టర్ ఆర్.ఎస్.ఎస్.వి.ప్రసాద్, మరియు, ఎం.పి.పి, పాలటి యల్లారేశ్వరి వారి చేతులమీదుగా (టబ్స్, టవెల్స్, మగ్స్, సోప్ ,అయింటెమెంట్స్, ) పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోదవ్యాదితో బాదపడుతున్న వ్యక్తులకి అవగాహన కల్పించడం జరిగింది, బోద వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రతలు, తెలియజేయడం జరిగింది, ఆరోగ్య పర్యవేక్షకులు జీన్నూరి శ్రీనివాస్, బోద కాలు పుండు పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి అని అని స్వయంగా క్లీన్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో బాగంగా కమ్మ్యూనీటి హెల్త్ ఆఫీసర్ ఎం. సుబ్రహ్మణ్యం, మహిళా ఆరోగ్యకార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.
