తణుకు నియోజకవర్గ పరిశీలకులు వేణుగోపాలరాయుడు పిలుపు
మే 2న అమరావతి రానున్న ప్రధానమంత్రి మోడీ
వచ్చేనెల 2న జరగబోయే అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన సభను విజయవంతం చేయాలని తణుకు నియోజకవర్గ పరీక్షలకు శ్రీ యర్రా వేణుగోపాల రాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తణుకు నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని పర్యటనను కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోందని గత మోడీ పర్యటనకు మించి విజయవంతం చేయాలని కోరారు. మే 2న అమరావతి రాజధాని అభివృద్ధికి సుమారు రూ. లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం విధ్వంసం చేసిన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తణుకు నియోజవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ కోటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.