ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో మంగళవారం చెత్తనుండి సంపద తయారీ కేంద్రం వద్ద స్వచ్ఛఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మీకంపొస్ట్ తయారులో తడి, పొడి చెత్తను ఏవిదంగా గ్రీన్ అంబాసిడర్ లకు (రిక్షాలకు) అందించాలి, దానిని SWM కేంద్రాల్లో ఏవిధముగా తడిచెత్త నుండి వర్మీ ఎరువును పొడిచెత్త నుండి కిలోల లెక్కలో అమ్మకం చెయ్యాలి దీనిద్వారా గ్రామాలు స్వచ్చ గ్రామాలుగా, ఆరోగ్యంగా ఏవిదంగా ఆహ్లాదముగా కాగలవో మండల పారిశుధ్య సమన్వయకర్త కత్తుల ప్రకాష్, eoprd ఆంజనేయశర్మలు తెలియజేసారు. అదేవిదంగా IVRS కాల్స్ పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొక్క శ్రీనివాస్, కార్యదర్శి హాసన్ జానీ, సచివాలయం సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
