తూర్పు గోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగాఅంచనా – జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్నరాముడు

తూర్పు గోదావరి జిల్లాలో రబీ 2024 -2025 సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగాఅంచనా వేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు .

  • 09.05.2025 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 39,856 లు (ఎఫ్ టీ వో) కూపన్ లను జనరేట్ చేయుట జరిగినదన్నారు.
  • అందుకుగాను ఇప్పటి వరకు 24,798 మంది రైతుల నుండి 2,86,684,840 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది.

:. 31,582 FTO లకు గాను సంబంధించిన రూ.550 కోట్ల 26 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయుట జరిగింది.

  • ధాన్యం సేకరణ విషయంలో రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ వరకు ఆరబెట్టుకోవాలి.
  • జిల్లాలో ధాన్యం కొనుగోలు నిమిత్తమై ఇప్పటివరకు 62 లక్షల గోనెసంచులు రైతులు వినియోగించుకోవడం జరిగిందన్నారు.
  • ప్రభుత్వం వారు నిర్ణయించిన కనీస మద్దతు ధర కామన్ వెరైటీ కు గాను క్వింటాల్ రూ. 2300/- లు “గ్రేడ్ ఏ” కు క్వింటాల్ కు రూ. 2320/- లు చెల్లించడం జరుగుతుంది.
  • రబీ 2024-25 సీజన్లో ఎండల వలన రైతులు ఇబ్బంది పడకుండా ఇంటి వద్ద నుండే వాట్స్ యాప్ నంబరు 7337359375 ద్వారా షెడ్యూలింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగినది. అందుకు గాను 981 రైతులు ద్వారా వాట్స్ యాప్ నంబరు 7337359375 ద్వారా షెడ్యూలింగ్ చేసుకుని 12,817 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేయడమైనది.
  • రబీ 2024-25 సీజను లో 2833 వాహనాల కు GPS పరికరాలు అమర్చి ధాన్యం రవాణాకు ఉపయోగించడం జరిగిందని తెలియజేస్తున్నాము.
  • అంతే కాకుండా రైతులు తమ దాన్యం యొక్క తేమ శాతాన్ని బ్లూటూత్ ఫంక్షనాలిటీ ద్వారా తమ మొబైలు ఫోన్ లకు మెసేజ్ రూపంలో పంపి సదుపాయం కూడా కల్పించడం జరిగినది.
  • రైతులకు తాము అమ్మిన ధాన్యం సొమ్ము 24 నుండి 48 గంటలలో రైతుల ఖాతాలలో జమ చేయడం వలన రైతు సేవా కేంద్రాలలో మత్రమే ధాన్యం విక్రయించదానికి మొగ్గు చూపుచున్నారు.
  • అందుకు గాను ప్రధాన కార్యాలయం వారు తొలుత 2,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఇచ్చినప్పటికీ, మండలాల యొక్క వ్యవసాయ అధికారుల ద్వారా ఇంకనూ రైతుల వద్ద ధాన్యం ఉందని తెలుసుకుని, ఈ విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళిన పిదప మరియొక 30,000 మెట్రిక్ టన్నుల టార్గెట్, తదుపరి ఇంకొక 50,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇవ్వడం జరిగిందని తెలియజేయడమైనది.
  • ధాన్యం టార్గెట్ పెంచడం ద్వారా ఇప్పటి వరకు అదనంగా 3,302 మంది రైతులు లబ్ది పొందారని తెలియజేస్తున్నాము. ఈ విషయమై జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Scroll to Top
Share via
Copy link