తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిగా వై.బాలకృష్ణ

తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏపీపి ఎస్సీ ద్వారా నియామకం పొందిన వై. బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలియ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని స్పష్టం చేశారు.

మంత్రిని కలిసిన వారిలో డిఐపిఆర్వో సిహెచ్ శ్రీనివాస్, డీపీఆర్వో వై. బాలకృష్ణ లు ఉన్నారు.

Scroll to Top
Share via
Copy link