సత్యవాడ పాఠశాల విద్యార్థులకు మాక్ పోలింగ్

ఉండ్రాజవరం:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  ప్రజాస్వామ్య విలువలు , సహకారం, సమాజం పట్ల బాధ్యత మొదలైన విలువలు పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పీ ఎం శ్రీ స్కూల్స్ నందు, సమగ్ర శిక్ష సౌజన్యం తో” దేశ్ అప్నాయన్” సంస్థ ద్వారా యాక్టిజన్ క్లబ్ శనివారం ఏర్పాటు చేశారు. ప్రతీ నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పి ఎం శ్రీ), సత్యవాడ ఉన్నత  పాఠశాల సోషల్ ఉపాద్యాయులు పి ఎస్ వి సత్యనారాయణ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ క్లబ్  ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లను ఎన్నుకునేందుకు 6వ తరగతి విద్యార్థుల కు మాక్ పోలింగ్ నిర్వహించారు. నిజమైన ఎన్నికలను తలపించే విధంగా జరిగిన ఎన్నికలో ప్రెసిడెంట్ గా కళ్యాణం రాజు, వైస్ ప్రెసిడెంట్ గా జి ప్రవీణ్ కుమార్ విజయం సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల పి టి ఏ  కమిటీ చైర్మన్ జానా నాగబాబు  ఉత్తమ పౌరులు గా వ్యక్తులు వృద్ధి చెందాలంటే,  పాఠశాల స్థాయి నుండి ఇటు వంటి అవగాహన చాల అవసరమన్నారు. క్లబ్ యాక్టివిటీస్ కొనియాడారు. విద్యార్థులు ఓటింగ్, తదితర కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సూర్యకాంతం,  జి కుమారస్వామి, యు.ఎన్.ఎస్ శక్తి కుమార్, వి రామారావు, పి వెంకటేశ్వరరావు తదితరులు విజేతల ను అభినందించారు.

Scroll to Top
Share via
Copy link