విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం

*విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం**పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా చర్యలు**గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిన విద్యావ్యవస్థ**విద్యార్థులకు కిట్లు, యూనిఫామ్ అందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ* *****కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ విద్యావ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టం చేసిన జీవో 117 ను సమీక్షించి జీవో రద్దు చేసి నూతన విధానం ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రభుత్వం సంస్కరణలు చేశారని అన్నారు. సోమవారం తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు, యూనిఫామ్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న పేరుతో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అందుకు భిన్నంగా సమాజ సేవలో ఎంతో ప్రభావం చూపించిన వ్యక్తుల పేర్లు పెట్టడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేయడం కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు దర్శనం అని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లు పైన జగన్ బొమ్మను వేసుకోవడం చూస్తే వైసిపి ప్రభుత్వానికి ప్రచార యావ తెలుస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహించి సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ చేయనుందని చెప్పారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన సన్న బియ్యం అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో 148 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2014 – 2019 హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు 1500 స్కూలు డెస్కులను దాతల సహకారంతో పాఠశాలలకు అందించినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. అనంతరం తణుకు జాస్తి సీతామహాలక్ష్మి బాలిక ఉన్నత పాఠశాలలో స్వర్గీయ దమ్మలపాటి బ్రహ్మానందం జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు అందజేసిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్య మిత్ర కిట్లు, యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link