*యువ నాయకులు నారా లోకేష్ స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి వాట్సప్ వేదిక**94934 22222 ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు**వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ* ****రాబోయే నాలుగేళ్లలో తణుకు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సంక్షేమం అమలు చేసే దిశగా పునరెంకితం అవుతానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి వాట్సప్ వేదిక ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేడుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. 94934 22222 నెంబర్ కు హాయ్ అని పెడితే గ్రామం, వార్డు ఎంపిక చేసుకుని తద్వారా సమస్యను తన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని వివరించారు.
