ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.దుర్గా మహేశ్వరరావు, పి.హెచ్.సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ సెక్రెటరీలకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ సి.హెచ్.ఓ లకు,హెల్త్ అసిస్టెంట్స్ కు “వెక్టార్ బోర్న్ డిసీజెస్” పునః అవగాహన కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు నిర్వహించి మాట్లాడుతూ “వర్షాకాలం అంటే వ్యాధులకు అనువైన కాలమని, స్తబ్దతతో కూడిన నీటినిల్వలు దోమల పుట్టుకకు స్థావరాలని, ఇందులో భాగంగా దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధుల రాకుండా ముందస్తు చర్యలలో భాగంగా ప్రతీ రోజు డ్రైడేగా పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించవలసిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బంది పై ఉందని, రెగ్యులర్ ఫీవర్ సర్వే చేయాలని,విలేజ్ హెల్త్ సెక్రెటరీలు “ఔట్ డోర్ దోమల ఉత్పత్తి స్థావరాల సమాచారాన్ని” వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ లో అప్లోడ్ చేసి, పంచాయతీ శానిటేషన్ సెక్రెటరీకి తెలిపి, సమన్వయంతో పనిచేసి, మస్కిటో బోర్న్ డిసీజెస్ బర్డెన్ ఉండకుండా చూడాలని” వివరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ కె.డి.ఎల్.ఎన్ కుమారి,హెల్త్ సూపర్వైజర్లు ఎ.శ్రీరామమూర్తి, సి.హెచ్.మేరీరత్నం, పి.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.
