తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ శాశ్వత సభ్యత్వం నిమిత్తం లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది
*************
తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు 2024,2025 కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ఉన్న దాని కన్నా భిన్నంగా ఈరోజు 100 రూపాయలు సభ్యత్వం అని ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని దానితోపాటు తెలుగుదేశం పార్టీలో గౌరవం కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే విధంగా శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఒక లక్ష రూపాయలు చెల్లించి జీవితకాల సభ్యత్వాన్ని పొందే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక తెలుగుదేశం పార్టీలోనే జీవితకాల సభ్యత్వం ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఒక వినూత్నమైన ఆలోచనతో జీవితకాలం సభ్యత్వాన్ని నమోదు ద్వారా టిడిపి కార్యకర్తలు గాని కార్యకర్తల కుటుంబసభ్యులకు అండగా నిలబడాలని అన్ని విధాలుగా పార్టీ ద్వారా సేవలు అందించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో వారికి ఇబ్బందులను అధిగమించి విధంగా ముఖ్యంగా వారి పిల్లలకు చదువుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అవకాశాలు కల్పిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి దేశ విదేశాలలో ప్లేస్మెంట్ వచ్చే విధంగా జరుగుతుందని అన్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమోదైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కార్యకర్తలు అధికమైన వంటి ప్రయోజనాలు ఇస్తూ కార్యకర్తలు పార్టీగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్తలకు అండగా నిలబడి కార్యకర్తల సంక్షేమానికి ఈ సభ్యత నమోదుకు వేదికగా తీసుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని అన్నారు. తణుకు శాసనసభ్యులుగా అయిన నేను శాశ్వత సభ్యత్వం నిమిత్తం లక్ష రూపాయలు చెల్లించానని అలాగే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 100 రూపాయలు సభ్యత్వాన్ని పొందితే 5 లక్షల వరకు భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే శాశ్వత సభ్యత్వానికి లక్ష రూపాయలు చెల్లించాలని జీవితకాల సభ్యత్వం పొందే అవకాశం కల్పిస్తుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగుదేశం పార్టీలోనే జీవితకాల సభ్యత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సభ్యత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారు కుటుంబసభ్యులు ఈ సభ్యత్వం ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
