ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో గురువారం అర్ధరాత్రి అతి ఘోరంగా వ్యవసాయ క్షేత్రంలో గల పశువుల మకాంలో మూడు పశువులను నరికి చంపిన దుండగులు. ఉదయం పొలము వెళ్ళిన రైతు రక్తపుమడుగులో మడుగులో మరణించి ఉన్న తన పశువులను చూసి నిర్ఘాంతపొయాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాజకీయ కక్షలో భాగమా లేక గంజాయి బ్యాచ్ చేసిన పన అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు సిబ్బంది.
