కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్. మంగళవారం నాడు తణుకు తహసిల్దారు కార్యాలయము ముందు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించి తహసిల్దారు కి మెమొరాండాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా జిల్లాకార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ దేశంలో ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వాటిని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అరికట్టాలని అన్నారు. మెడికల్ విద్యార్థినిపై జరిగిన సంఘటన రూపుమాపకుండా మరో సంఘటన జరగడం విచారకరమని అన్నారు. కాలేజీల్లో మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని దేశంలోని న్యాయవాదుల రక్షణ కోసం సమగ్రమైన చట్టం చేయాలని మునిస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కొండా శ్రీనివాసరావు, పుట్ల శ్రీనివాసు, చింతపల్లి నాగేశ్వరరావు, యూ.పులేశ్వరావు, పిట్ట శామ్యూల్ బర్రె విక్టర్ బాబు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏమని సిద్దేశ్వర ప్రసాదు పాల్గొన్నారు.
