ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం శాఖ సమావేశం సోమవారం పాలంగి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానకిరామరాజు అధ్యక్షతన మండల మానవత ఉండ్రాజవరం శాఖ నూతన కార్యవర్గ ఎంపిక సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండల అధ్యక్షులుగా ఉప్పలపాటి శ్రీనివాస్ ఉపాధ్యక్షునిగా వాకలపూడి రామకృష్ణ, కార్యదర్శిగా ఐసెట్టి విజయరాజు, కోశాధికారిగా మట్టపర్తి భువన్ కుమార్, సహాయ కార్యదర్శిగా ఈడుపుగంటి నాగేశ్వరరావు, ఈసీ ఎడ్యుకేషన్ జి వీరన్న, ఈసీ ఎమర్జెన్సీ గన్నమనీ ప్రసాద్, ఈసీ హెల్త్ దొడ్డ సూర్యనారాయణ, ఈసీ అవేర్నెస్ పెద్దింటి గోపికృష్ణ, డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్ గా కోడూరి వీవీఎస్ ఎన్ ప్రసాద్, కో చైర్మన్ కడలి మాణిక్యాలరావు, కన్వీనర్ శ్రీమతి పనితిని పార్వతి, డైరెక్టర్లుగా సుంకవల్లి వెంకటేశ్వరరావు, ముదునూరు సుబ్బరాజు, మద్దుకూరి రమేష్ చౌదరి తాళం వెంకటకృష్ణ, బోర్డు అడ్వైజరీ బోర్డ్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, మానవత శాంతి ర్యాలీ చైర్మన్ & సెంట్రల్ కమిటీ డైరెక్టర్ గమిని రాంబాబు, మానవతా రాష్ట్ర కన్వీనర్ & కెరీర్ గైడెన్స్ చైర్మన్ కె. రాధా పుష్పావతి, మానవత జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, పూర్వపు అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు, కార్యదర్శి పనితిని పార్వతి, కోశాధికారి కోడూరి శ్రీనివాసరావు, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ వేలిచేటి బోసు, నందిగం వెంకటకృష్ణ పాపారావు, పాలాటి శరత్ బాబు, టి నాగేంద్ర, పుల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
