రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కింది స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం తణుకులోని 5, 7, 8,27 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 5వ వార్డు అధ్యక్షుడిగా నొడగల బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా గమిని లక్ష్మి వెంకట ప్రశాంత్, 7వ వార్డు అధ్యక్షుడిగా వూటా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా యడ్లపల్లి దుర్గాప్రసాద్, 8వ వార్డు అధ్యక్షుడిగా చిన్నం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పులసరి శ్రీనివాస్, 27వ వార్డు అధ్యక్షుడిగా కొత్తలంక సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా షేక్ అబ్దుల్లా బూజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
