పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి

తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం వార్డు స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తణుకులోని 14, 16, 18, 32 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. పార్టీ పటిష్టత కోసం పని చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో 14వ వార్డు అధ్యక్షుడిగా దేవిశెట్టి వీరకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కట్టా రామకృష్ణ, 16వ వార్డు అధ్యక్షుడిగా గొల్తి నాగవెంకటకామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మణ్ని శ్రీనివాస రాయుడు, 18వ వార్డు అధ్యక్షుడిగా నందా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొండేపూడి సూర్యనారాయణ, 32వ వార్డు అధ్యక్షుడిగా నల్లా వీరవెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఉండ్రాజవరపు వేణుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

Scroll to Top
Share via
Copy link