పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట, గంజాయి, క్రికెట్ బెట్టింగ్స్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో తణుకు
పనికి ఆహార పదకంలో ఆర్కే టాక్స్
రిజిస్ట్రేషన్లో కూడా ఆర్కే టాక్స్
సంపద సృష్టిస్తాను లక్ష అధికారులు చేస్తాను అనే అబద్దాలతోటి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూ నాయకులు నేడు ఒక్క సంవత్సరంలోనే 1,65,000 కోట్లు అప్పుచేసి చేశారని తణుకు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ మోసాలపై చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహణ విషయాలను వెల్లడించడానికి తణుకు క్యాంపు కార్యాలయంలో గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబడి సంవత్సరం కావచ్చిందని సంవత్సరకాలంలోనే 93మంది కూటమి ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని, తమ ఎమ్మెల్యేలపై సర్వే చేయించానని చంద్రబాబు… పచ్చ మీడియా ఏబీఎన్ ఛానల్ లోనే ఎమ్మెల్యేల పనితీరు అద్వానంగా ఉందని చెబుతున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ వస్తే భూములు లాగేసుకుంటారని ప్రచారం చేసిన కూటమి నాయకులు తామ అధికారంలోకి వచ్చాక అదే ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తూ చంద్రబాబు స్థానిక తెలుగుదేశం నాయకులు ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రతి ఇంటికి పాసుబుక్ పట్టుకు వెళ్లి జగన్ వస్తే మీ భూములు తాకట్టు పెడతాడు అన్న నాయకులు నేడు ప్రతి మంగళవారం ఏదో ఒక కార్పోరేషన్ తాకట్టు పెట్టి కొట్లాది రూపాయలు అప్పు తేవడం జరుగుతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మూడు లక్షల 35 వేల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే లక్ష 65 వేల కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కారుమూరి అన్నారు. కూటమి ప్రభుత్వం మొత్తం అప్పులమయం అయిందని కరోనా సమయంలో కూడా ఏనాడు జగన్ ప్రభుత్వం పథకాలు ఆపలేదని, మేము పెట్టిన బడ్జెట్ కన్నా పదివేల కోట్లు ఎక్కువగా పెట్టిన కూటమి ప్రభుత్వం ఖర్చులు ఎక్కువ చేస్తూ అదే జీతాలు చెల్లిస్తూ, హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయని ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏనాడు ఏ పథకాన్ని ఆపలేదని, ఇచ్చిన హామీలు కన్నా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్నిదని కారుమూరి అన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వ మోసాలను వైసీపీ శ్రేణుల నిరసనల ద్వారా జిల్లా మండల కేంద్రంలో, గ్రామాల్లో వార్డుల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా తణుకులో అయితే దోపిడి ఈ విధంగా కూడా చేయవచ్చా అనే విధంగా ఆర్కే టాక్స్ కలెక్షన్ ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తు అధికార పార్టీ నాయకులే తనకు చెబుతున్నారని, దోపిడి అంటే పనికి ఆహార పథకంలో పనికి వెళ్ళని వారి పేరా మస్తరు సృష్టించి వారికి వంద రూపాయలు చెల్లించి మిగిలిన డబ్బును ఆర్కే టాక్స్ పేరిట స్వాహా చేస్తున్నారని అన్నారు. మద్యంపై ధరను మరల పది రూపాయలు పెంచారని పేదవారి రక్త మాంసాలను దోచుకుంటున్నారని అన్నారు. బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ, ఏ సమయంలోనైనా మద్యం నియోజకవర్గంలో లభిస్తుందని అన్నారు. పేకాటలు యదేచ్ఛగా ఆడిస్తున్నారని, రోజుకు లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నెంబర్ వన్ స్థానంలో ఉందని, గంజాయి, క్రికెట్ బెట్టింగ్స్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో తణుకు నియోజకవర్గ ఉందని అన్నారు. ఆర్కే టాక్స్ పేరిట కౌంటర్లు పెట్టి వసూలు చేసుకుంటున్నది తమరే అని, పైగా నియోజకవర్గంలో ఉండనని వారంలో ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతానని అంటున్నారని తాను ఎమ్మెల్యేను కాను ఈ నియోజకవర్గంలో బాధ్యతగా ఉండవలసినది ఎవరో తెలుసుకోవాలని అన్నారు, కరోనా సమయంలో కూడా తాను ఎక్కడికి వెళ్లలేదని ప్రాణాలకు తెగించి ప్రజల మధ్య ఉన్నానని కారుమూరి అన్నారు. ఎన్నికలలో కూడా సహకరించని వారు నేడు నీవు చేస్తున్న దోపిడీ గురించి నన్ను మాట్లాడమని చెబుతున్నారని, 70% మీ నాయకులే నాకు చెబుతున్నారని, నీవు చేస్తున్న దోపిడీ గురించి నాకు తెలియని విషయాలను కూడా మీ పార్టీ పెద్దలే తెలియజేస్తున్నారని, దోపిడీ రిపోర్టు అంతా ఉందని, రిజిస్ట్రేషన్లలో కూడా ఆర్కే టాక్స్ వసూలు చేస్తూ చేస్తున్నారని ఈ విధమైన దోపిడీని ఎన్నడూ చూడలేదని కారుమూరి అన్నారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆ ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని అన్నారు. ఈ మోసాలను దోపిడీలను తెలియజేయడానికే వైసీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.