ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అల్లూరి సీతారామరాజు
అల్లూరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
యువతలో స్ఫూర్తి నింపే విధంగా తన పోరాట పటిమను బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అనేకసార్లు పోరాటాలు చేసిన ఘనత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని వేల్పూరు రోడ్డులోని విమాక్స్ థియేటర్ సెంటర్ వద్ద సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారి చేతుల్లో సీతారామరాజు మృతి చెందినప్పటికీ ఆయన ఆశయాలు, స్ఫూర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు