పిట్టకథలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న కారుమూరి
ఘాటు వ్యాఖ్యలు చేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
అత్తిలి మండలంలో తిరుపతి పురం వరిగేడు తణుకు పట్టణంలో 12,13 వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
గత ఐదేళ్ల వైసిపి పరిపాలనలో వ్యవస్థలను మీరు వీరియం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా సంక్షేమాన్ని పక్కలో పట్టించారని విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అత్తిలి మండలం తిరుపతిపురం, వరిఘేడు గ్రామాల్లో మరియు తణుకు పట్టణం 12,13 వార్డుల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి గత ఏడాదికాలంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నియోజకవర్గంలో అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా పర్యటిస్తూ పిట్టలదొరలా పిట్టకథలు చెబుతూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కింద స్థాయి వరకు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై బురద జల్లడమే వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ పెంపుదల, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఇలాంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా పంటకాల్వలు శుభ్రం చేయడంతో పాటు చూడు తొలగింపు వంటి చర్యలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వరిఘేడు గ్రామంలో దీర్ఘకాలింగాకంగా ఉన్న సమస్యలను ముఖ్యంగా జిల్లా పరిషత్తు రోడ్డును రూ. 60 లక్షలతో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హాయంలో నిర్మించిన రోడ్లు తర్వాత గత అయిదేళ్ల కాలంలో వైసిపి హయాంలో నిర్లక్ష్యం చేశారని అన్నారు. వరిఘేడు గ్రామంలో వేసవిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా శాశ్వత పరిష్కారం లభించేలా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతి పురం గ్రామంలో సైతం రబీలో శాశ్వత పరిష్కారంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాలకు మేలు చేయాలంటే కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.