నిదదవోలు సర్కిల్, ఉండ్రాజవరం ఎస్.ఐ. గా డి రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఈయన అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంగర పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి, బదిలీపై ఉండ్రాజవరం వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతంపలికి శుభాకాంక్షలు తెలిపారు.