కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పల్స్ హాస్పిటల్ ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో, ఐసీయూ ఇన్ పేషెంట్ గదులు, ఔట్ పేషెంట్ గదులు, రోగికి రిలాక్స్ ఉండే విధంగా సహజ కాంతితో కూడిన వాతావరణ కల్పించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఐసీయూ, ఇతర సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అప్పల రత్నం కూటమి వార్డు అధ్యక్షులు యజ్ఞశ్రీ, సీఎం రమణ తో పాటు యువనేత లు జోగిరాజు, పవనిజం, సంద్య , పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
