విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వర్ధంతి కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలులు అర్పించారు. అనంతరం పేదల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కర్తలు మళ్ళ విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, పర్యవేక్షకులు రవి రెడ్డి, రాష్ట్ర పార్టీ నాయుకులు డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్, జిల్లా పార్టీ కోశాధికారి అనిల్ కుమార్ రాజు, కార్పొరేట్లు రెయ్యి వెంకట రమణ, బిపిఎన్ కుమార్, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పెడాడ రమణి కుమారి, సనపల రవింద్ర భరత్, పులగం కొండా రెడ్డి, కర్రి రామి రెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బోండా ఉమా మహేశ్వర రావు, దేవరకొండ మార్కెండేయులు, జిల్లా పార్టీ కమిటి మంచా నాగ మల్లేశ్వరి, ఎం. సత్యనారాయణ, పద్మశేఖర్, రాష్ట్ర, జిల్లా నియోజకవర్గం అనుబంధ కమిటి కాళిదాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, అప్పన, శేఖర్, పార్వతి, రామ్ ప్రసాద్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
