బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయం
భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, దేశ ఐక్యత కోసం అసమాన కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా, బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణు కుమార్ రాజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అరుణ్ బాబు, ఆశీర్వాదం, అనిల్, దుర్గా రావు, ప్రసాద్, నారాయణ రావు తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, త్యాగం మరియు జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమం దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డాక్టర్ ముఖర్జీ ఆశయాలను కొనసాగించేందుకు బీజేపీ నిబద్ధతను పునరుద్ఘాటించింది.