బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు
నూతనంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమాలు అవగాహన కార్యక్రమంలో బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు తెలిపారు. శనివారం విఎంఆర్ ఎ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మై వెబ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి, వారి అభివృద్ధికి పాటుపడే బిందు ఉమెన్ సొసైటీ ని అభినందించారు. ఇలాంటి ఎక్స్ప్ లా ద్వారా మరిన్ని రంగాల్లో మహిళ పారిశ్రామిక వేత్తలు అభివృద్ధి చెందుతారని ఆకాక్షించారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారాన్ని అందుంచేందుకు కృషి చేస్తామన్నారు..అనంతరం నిర్వహకురాలు హిమబిందు మాట్లాడుతూ మహిళ అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్ష తో 2022లో ఈ సంస్థ ను ప్రారంభించాం అన్నారు. స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందజేత, ఇతర అంశాలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ అవగాహన కార్యక్రమం సందర్భంగా పలువరు ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చెశారు.