ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డి
అత్తిలి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు
ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
టిడిపిలో చేరిన పలువురు పాలురుకు చెందిన కార్యకర్తలు
కొమ్మరలో మినీ గోకులం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత వైసిపి ప్రభుత్వాలలో మోసపూరిత సంక్షేమాన్ని అమలు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏద్దేవా చేశారు ప్రస్తుతం కూటమ ప్రభుత్వంలో అసలైన సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఐదేళ్లపాటు గడిపేసిన పరిస్థితి ఉందని విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం అత్తిలి మండలం పాలూరు, కొమ్మర గ్రామాలతోపాటు తణుకు పట్టణంలోని 15, 16 వార్డుల్లో ఇంటింటికి టిడిపి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏడాదికాలంగా అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకుంటూ ఏ ఇంటికి వెళ్లిన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెట్టింపు సంక్షేమాన్ని అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. పాలూరు గ్రామంలో రూ. 2.50 కోట్లు విలువైన అభివృద్ధి, సంక్షేమాన్ని అందించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 2.16 కోట్లు విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యానికి సంబంధించి నిధులను పూర్తిస్థాయిలో ప్రజలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో రాబోయే నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే విధంగా పరిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో ప్రతి 14 రోజులకోసారి యాంటీ లార్వా స్ప్రే చేసే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను రాబోయే 10 రోజుల్లో అందించేందుకు చర్యలు చేపట్టానట్లు తెలిపారు. గత వర్షాకాలంలో ముంపు బారిన పడిన రైతులకు సంబంధించి ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా అన్ని చర్యలు చేపట్టమన్నారు. పి 4 విధానంలో పేద కుటుంబాలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాలు దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి పాటుపడేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలూరు గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం కొమ్మర గ్రామంలో మినీ గోకులం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.