అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

గత ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు

కూటమి హయాంలో పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

అత్తిలి మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు

అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకతాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మంగళవారం అత్తిలి మండలం పాళీ బల్లిపాడు గ్రామాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి ప్రజలకు గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలనలో పెట్టుబడులు, పరిశ్రమికవేత్తలు రాకపోగా రాష్ట్రం నుంచి పారిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శించారు. అలాంటి పరిస్థితుల నుంచి పారిశ్రాగమేతలు, పెట్టుబడులు వచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించిందని చెప్పారు. మరోవైపు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పాలి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 40 లక్షలు స్మశాన వాటిక అభివృద్ధికి పది లక్షలు అంతేకాకుండా రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. బల్లిపాడు గ్రామంలో సైతం జలజీవన్ మిషన్ తో పాటు రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా గోకులం షెడ్లు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా మొదటి ఏడాదిలోనే దాదాపు రూ. 9.30 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి 4.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టుకునేందుకు రాష్ట్రంలో ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link