ఉండ్రాజవరం, జులై 27, 2025 : గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోసి, గ్రంథాలయాల పురోభివృద్ధికి విశేష కృషి చేసిన గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వేంకట రమణయ్య అని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ అన్నారు.
గురువారం ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో జరిగిన అయ్యంకి వేంకట రమణయ్య 135 వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తొలుత గ్రధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యంకి చిత్రపటానికి కోట రామ ప్రసాద్ పుష్పమాల అలంకరించి పుష్పాంజలి ఘటించారు. సభలో పాల్గొన్న వారందరూ అయ్యంకి వారికి పుష్పాంజలి ఘటించారు.
గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యంకి వేంకట రమణయ్య గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలు చేశారని శ్లాఘించారు.
మరొక ముఖ్య అతిధి రిటైర్డ్ ఆంగ్ల భాష ఉపాధ్యాయులు గజ్జరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న సమాజంలో సాంకేతికాభివృద్ధికి అనుగుణంగా గ్రంథాలయాలు మార్పు చెందుతూ చదువరులకు విశేషమైన సేవలు అందిస్తున్నాయన్నారు.
హిందీ ఉపాధ్యాయులు పెరుమాళ్ళ రామదాసు మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థుల జీవితాల్లో ఙ్ఞాన జ్యోతి వెలిగిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి శ్రీరామ చంద్ర మూర్తి, తానేటి సుబ్బారావు, కొల్లాటి అప్పారావు, పచ్చిపులుసు శ్రీనివాసు, కె.వి.కృష్ణారావు, వి.అనిల్, కామరాజు ప్రభృతులు పాల్గొన్నారు.