సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ఫ్రె డే కార్యక్రమంలను బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ అన్నారు
పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ తణుకు పట్టణంలోని బ్యాంకు కోలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిబ్బంది హాజరు,ఓ.పి.రోగులకు అందుతున్న సేవలు నమెదు, మందులు అందుబాటు, EHR నమెదు, అబా ID లు,, ఆరోగ్య సమాచారం కూడిన ఐ.ఇ.సి గోడ పత్రికల ప్రదర్శన తదితర అంశాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ఫ్రె డే కార్యక్రమంలను బలోపేతం చేయాలని అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమంలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, రక్షిత మంచినీరు వినియెగించడం ద్వారా సీజన్లో డయేరియా ప్రబలకుండా నియంత్రణ చేయవచ్చని ఆరోగ్య సిబ్బంది వార్డుల్లో ఆరోగ్య సర్వే తరచూ నిర్వహణ చేయాలని తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.