చొప్పెల్లలో నీటిపారుదల తెలుగుదేశం పార్టీ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, చొప్పేల్ల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగినది. శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని, అజాతశత్రువుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న, మంచి ప్రజా సేవకులు అని శాసనసభ్యులను, పలువురు వక్తలు కొనియాడారు. శాసనసభ్యులు బండారు సత్యానందరావు వారిపై తప్పుడుగా విమర్శలు చేసినా, అన్యాయంగా విమర్శిస్తే సహించమని,పలువురునేతలు ఘాటుగా స్పందించారు! ఈ సమావేశమునకు చొప్పెల్ల గ్రామ నాయకులు, చొప్పెల్ల గ్రామo నుంచి ఆలమూరు మండలానికి ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత మండల నాయకులు, మాజీ మండల నాయకులు, పలువురు ప్రముఖులు,, కార్యకర్తలు, బూత్ కమిటీ అధ్యక్షులు, చొప్పెల్ల వేణుగోపాలస్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధులు పలువురు హాజరు! చొప్పెల్ల గ్రామంలో కాని, ఆలమూరు మండలంలో కానీ, కార్యకర్తలకు ఎవరికి, ఏ కష్టం రానివ్వమని, ప్రతి ఒక్క కార్యకర్తలకు, ప్రజలకు,ఉమ్మడి కూటమి కార్యకర్తలకు, శాసనసభ్యులు బండారు సత్యానందరావువారి ద్వారా అండదండలు, సహకారము అందిస్తామని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుని, 2029 ఎన్నికలలో భారీ మెజారిటీ దిశగా బండారు సత్యానందరావు వారిని నడిపిస్తామని, పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలను ఎవరిని మర్చిపోమని, ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలకు,దిశా నిర్దేశం చేశారు. రేపు రాబోయే పంచాయితీ ఎన్నికలకు, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు బండారు సైన్యం సిద్ధంగా ఉండాలని, మండలంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఉమ్మడి కూటమి కార్యకర్తలంతా కలిసి మెలిసి పనిచేయాలని కోరారు! ఈ సందర్భంగా ఈ సమావేశమునకు ప్రముఖులు డి సీ చైర్మన్ మెర్ల గోపాలస్వామి, ఆకుల సత్యనారాయణ అనే అన్నవరం, సగ్గుమళ్ళ రాముడు, బళ్ల హరికృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు మద్ది పట్టాభి తనయులు శివ, మద్ది పట్టాభి, మాజీ వైస్ ప్రెసిడెంట్ సుంకర కామరాజు, రాయుడు లక్ష్మణరావు ఎక్స్ ఎం పి టి సి, బి సి నాయకులు, మండల పరిషత్ మాజీ ఉపా అధ్యక్షులు జాంపోలు వెంకట్రావు, సోము రాంబాబు,మెర్ల శ్రీను, బీసీ నాయకులు వెన్నా భీమశంకరం,గుత్తుల ఆంజనేయులు, పాలకొల్లు రాంబాబు, అనుసూరి వీరాస్వామి,, దళిత నాయకులు కాకిలేటి కృష్ణ, అనుకుల సుదర్శన్ రావు (కరెంట్) తదితర ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link