దాతలు ముందుకు రావాలి – ప.గో.జిల్లా డిప్యూటీ డి.ఎం.హే.చ్.ఒ డాక్టర్ రవికుమార్

ఇరగవరం మండలంలో గల పి.హెచ్సి, సబ్ సెంటర్లు యందు జరుగుతున్న టీ.బి., లెప్రసీ, వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డుల పరిశీలనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ డి.ఎం.హే.చ్.ఒ డాక్టర్ రవికుమార్ శుక్రవారం నాడు ఇరగవరం మండల వ్యాప్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలో ఎఫ్బిసి ల్యాబ్ లను పరిశీలించి మాట్లాడుతూ టీ.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలను టి.బి. పేషెంట్లు వినియోగించుకోవాలని అదేవిధంగా కోరారు అదేవిధంగా టి.బి.పేషెంట్లకు పోషకాహార నిమిత్తం ఇచ్చే ప్రత్యేక కిట్లను అందించడానికి దాతలు ముందుకు రావడానికి కృషి చేయాలని వారికి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండల పిహెచ్సి డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link