దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కె.వి. సూర్యనారాయణ
విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్)
జగదాంబ జంక్షన్ లోగల మాజీ ప్రధాని రాజీవగాంధీ విగ్రహాన్ని రోడ్ అభివృద్ది చేయు నిమిత్తం తొలగొంచడం జరిగింది, ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ట చేయమని ఎన్నోమార్లు జీవీఎంసీ కమిషనర్ కి విన్నవించాము. నేటి వరకు స్పందిచలేదు ఆఖరి సారిగా, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కేవీ. సూర్యనారాయణ ఆధ్వర్యంలో మేయర్ శ్రీనివాస్ ని కలసి వినతి పత్రం అందచేసి రాజీవగాంధీ విగ్రహాన్ని అయన పుట్టినరోజు ఆగస్టు 20 నాటికీ ఏర్పాటు చేయమని కోరడమైనది, దానికి స్పందించిన మేయర్ తొందర్లోనే కమిషనర్ తో మాట్లాడి స్థలం కేటాయిస్తాము అనిచెప్పారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర స్పోర్ట్ చైర్మన్ జివివి కమలాకర్ రావు, బీమిలి నియోజకవర్గం ఇంచార్జి రామకృష్ణ, తూర్పు నియోజకవర్గం ఇంచార్జి దండి ప్రియాంక, కస్తూరి వెంకటరావు, బాషా, దేవా, నూకరాజు, సత్యనారాయణ, అప్పారావు, శ్రీధర్, షిప్ యార్డ్ ప్రసాద్, రజనీకాంత్, గాయత్రి, విజయప్రసాద్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.