కోడిగుడ్ల శ్రీధర్ పరామర్శించిన వాసుపల్లి
విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్)
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కును కాలరాస్తూ కూటమి నేతలు వైసిపి నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 41 వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ పై పెట్టిన అక్రమ కేసును ఖండిస్తూ వారి ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి పరామర్శించారు. ఇటీవల 41 వ వార్డులో నిర్వహించిన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం విజయవంతం అయిందని నేపథ్యంలో ఓర్వలేని అక్కడి స్థానిక కూటమినేతలు 41వ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ పై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతపై ఎండ కట్టేందుకు 41వ వార్డు స్థానికులు స్వతహాగా ఆరోజు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కోడిగుడ్ల శ్రీధర్ దంపతుల సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిపై అక్కడ ప్రజలకు విడదీయరాని అభిమానం ఉంది. వారిని స్థానికంగా దెబ్బతీయాలని ఎత్తుగడలు వేస్తున్న స్థానిక కూటమి నేతలు అదును చూసుకొని అక్రమకేసులు పెడితే చూస్తూ సహించేది లేదన్నారు. భవిష్యత్తులో వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, తోక జాడిస్తే కత్తిరించి చూపిస్తామని వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, 33వ వార్డు అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్, సౌత్ సంస్కృత విభాగం అధ్యక్షులు పి. సూర్య నాయుడు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.