పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి రాష్ట్ర ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లా ART Surrogacy కేంద్రాలు తనిఖీలలో భాగంగా తణుకు పట్టణంలోని సుధా ఆసుపత్రిలోని ART L2 క్లినిక్,ART Bank, సరోగసి కేంద్రంలను అదేవిధంగా సుప్రజ ఆసుపత్రిలోని ART Level 2, ART Bankలోని విఘ్నేష్ టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ ART Level 1 తనిఖీలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి ART క్లినిక్ నిర్వహణ కోరకు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు పరిశీలించడం జరిగినది. తదుపరి సత్యవతి నర్సింగ్ హోం, భాగ్యశ్రీ ఆసుపత్రిలలోని స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది
ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న గర్బణీలకు నిర్వహించే స్కానింగ్ నిర్వహణ, అనుమతులు తదితర అంశాలను పరిశీలించడం జరిగినది.
