పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ మంగళవారం పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి.గీతాబాయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి నెలా మొదటి మంగళవారం నిర్వహించే ఆశా డే కార్యక్రమం సందర్భంగా పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆశా డే కార్యక్రమంను ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మాట్లాడుతూ కిల్కారి సేవలు వినియెగం, ఆశా కార్యకర్తలు అందించవలసిన మాతా శిశు సంరక్షణ సేవలు, ఆరోగ్య విద్య బోధన తదితర అంశాలపై సమీక్షించారు. తదుపరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, ఓ.పి.నమెదు, మందులు అందుబాటు, EHR నమెదు, అ.బా. ID లు, ఐ.ఇ.సి గోడ పత్రికల ప్రదర్శన తదితర అంశాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link