రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలి

తణుకు మండలం దువ్వలోని దానేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థించిన మంత్రి కందుల దుర్గేష్

దువ్వ దేవస్థానంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన కాపవరం మాజీ వైస్ ఎంపీపీ నందిప చక్రవర్తి గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకొని నేడు ఆ మొక్కుబడి తీర్చుకున్న మాజీ వైస్ ఎంపీపీ

తణుకు: రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. మంగళవారం పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలంలోని దువ్వ గ్రామంలో శ్రీ దానేశ్వరి అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి దుర్గేష్ కు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రీతిపాత్రమైన కలువపూలను సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను పెరవలి మండలం కాపవరం గ్రామస్థులు, మాజీ వైస్ ఎంపీపీ నందిప చక్రవర్తి కలిశారు. మంత్రి కందుల దుర్గేష్ ఎన్నికల్లో విజయం పొందితే తాము దానేశ్వరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని ఈ సందర్భంగా ఆ మొక్కును తీర్చుకోవడానికి వచ్చామని తెలిపారు. అనంతరం మంత్రి దుర్గేష్ తో కలిసి మొక్కుబడిని తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జ్ఞానాన్ని ప్రసాదించే దేవి దానేశ్వరి అమ్మవారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంపై మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు. తనపై అభిమానం చూపించిన ప్రతి ఒక్కరినీ పేరుపేరున మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.ప్రజల నమ్మకాన్ని గెలిపించేలా, రుణం తీర్చుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.

అంతకుముందు దువ్వ గ్రామానికి విచ్చేసిన మంత్రి దుర్గేష్ కు స్థానిక కూటమి నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Scroll to Top
Share via
Copy link