పశ్చిమగోదావరి జిల్లా భవన కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రతినిధి బృందం
రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు ఎదురుచూపులు 46 వేల పెండింగ్ క్లెయిమ్స్ లబ్ధిదారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం ఎదురుచూపులు
నిడదవోలు ఎమ్మెల్యే పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి భవన కార్మికుల సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని కుటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 13నెలలు గడిచిన అమలుకాలేదని ప్రభుత్వం బోర్డు చైర్మన్ తప్ప నెంబర్స్ వేయలేదని పవన్ కళ్యాణ్ దృష్టికి భవననిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు పున ప్రారంభవిషయంలో పవన్ కళ్యాణ్ చొరవచూపేలా చర్యలు తీసుకోవాలని
ఈ విషయంలో కార్మికులు పవన్ కళ్యాణ్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో 46 వేల క్రైమ్స్ ఇప్పటికీ అలాగే పెండింగ్‌లో ఉన్నాయని బోర్డులో తగినంత సొమ్ము ఉన్నా సరే ఈ విషయంలో ప్రభుత్వం చలనం లేదని కార్మికుల ప్రమాదంలో గాయపడిన మరణించిన దిక్కులేకుండా పోతున్నారని భవన కార్మికుల దీన పరిస్థితినీ మంత్రి ద్వారా వినతిపత్రాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాలని విజ్ణప్తి చేసారు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. ఈ సమస్యపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కట్టుబడి ఉందని ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేస్తామని రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో సంక్షేమ బోర్డుపై ముఖ్యమంత్రి కి, డిప్యూటీ సీఎం కి సమస్యల పరిష్కారాన్ని దిశగా పరిస్థితి వివరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, చలపతి మహాలక్ష్మి నాయుడు, వడ్లూరు సంఘం అధ్యక్షులు సాసుమల్లె పాల్గొనరావు, తణుకు తాలూకా సంఘాల అధ్యక్షుడు, నూకల నాగేంద్ర, వానపల్లి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.