సహకార సంఘాల 156 కోట్లు బకాయిలు తక్షణం చెల్లించాలి

రాష్ట్రంలో సహకార సంఘాలకు చెల్లించవలసిన 156 కోట్లు బకాయిలు తక్షణం చెల్లించాలని. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక సాలిపేటలో సంఘ పతాకాన్ని చేనేత సహకార సంఘం పూర్వ మేనేజర్ (రిటైర్డ్) కరేళ్ల నాగేశ్వరరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేతన్న నేస్తం పథకాన్ని మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికునికి కొనసాగిస్తామని. చేనేత సహకార సంఘాలకు 2017 నుండి పావలా వడ్డీలు. యారన్ సబ్సిడీ. రిబేట్ కింద చెల్లించవలసిన 156 కోట్ల రూపాయలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారని వీరభద్ర రావు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు సమయం అవుతున్న నేటికీ అమలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని వీరభద్రరావు విమర్శించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఉపాధి కల్పించడం కొరకు చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు చట్టాన్ని అమలు జరపకుండా చేనేత ముసుగులో పవర్ రూమ్స్ ప్రోత్సహిస్తున్నారని అందులో భాగంగానే శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పక్కనే ఉన్న బత్తలపల్లి గ్రామంలో 200 మగ్గాలు జె ట్లు మ్స్ ఏర్పాటు చేశారని దీనికి కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రసారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చేనేత సంఘ నాయకులను కేసులు పెట్టి అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి చేసింది తక్కువ ప్రసారం ఎక్కువ అని ఆయన చెప్పు కోచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు వచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరరావు. రుద్రాక్షల శ్రీనివాసు.తాడిశెట్టి వెంకటేశ్వరరావు. అందే శ్రీనివాసు. తిప్పా శివ. తాడిశెట్టి సూర్యారావు.వాసా త్రిమూర్తులు. అయిశెట్టి సత్యనారాయణ.అందే మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link