ఉచిత ఇసుక కొరకు నిబంధనలు తప్పనిసరి

ఉచిత ఇసుక తరలింపు నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు, ట్రాక్టర్ యజమానులు వాపోతున్నారు. పెండ్యాల తీపర్రు ఇసుక ర్యాంపులలో ట్రాక్టర్లకు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, పెరవలి తహసిల్దార్ అచ్యుత కుమారి, తణుకు తహసిల్దార్ వర్మ, పెరవలి డిప్యూటీ తహాసిల్దార్ కే. సన్నిబాబు, తీపర్రు ఇసుక ర్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత ఇసుక తరలింపు నిమిత్తం ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఉచిత ఇసుక పొందాలనుకునే లబ్ధిదారులు సచివాలయాల వద్ద నుండి నిర్మాణ నిమిత్తం అనుమతి పత్రంతో ఎవరు అనుమతి లేకుండా లోడింగ్ నిమిత్తం తగుచార్జీలు చెల్లించి తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. ఇసుక అనుమతి కొరకు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతులు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు కే.రామకుమార్, నారాయణ, పి. భీమరాజు, సత్యనారాయణ, గణపతి ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link