నవంబర్ 1 నుండి 15వ తేదివరకు జరుపబడిన ఆప్తవాజపేయం మహాయాగం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో చివరి రోజు కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు వేలాదిగాతరలివచ్చారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం, యాగశాల, స్వామి అమ్మవార్లను దర్సించుకుని, కొటికుంకుమార్చన జరిపిన కుంకుమను మహిళాభక్తులు స్వీకరించారు. అనంతరం భక్తులు ప్రాంగణంలో జరుపబడిన అఖండ అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.