పారిశ్రామిక నగరమైన తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం గురించి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో అరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించడం జరిగింది. కార్మిక శాఖా మంత్రి దృష్టికి తణుకు మరియు పరిసర ప్రాంతాల్లో 60 వేల కార్మికులు మరియు వారి కుటుంబసభ్యుల సమస్యలు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఎస్ ఐ భీమా కలిగి ఉన్న సభ్యులు చికిత్స కోసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది అని 2014 – 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ఎస్ ఐ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది అని దీనికి తాము 1.14 ఎకరాల భూమి కేటాయించినట్టు తెలిపారు. తరవాత 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే నిర్మాణాన్ని గాలికి వదిలేశారని సభకు తెలియచేశారు. ప్రస్తుతం తణుకులో ఉన్న ఈ ఎస్ ఐ డిస్పెన్సరి అద్దె భవనంలో ఉందనీ సిబ్బంది మరియు సౌకర్యాల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు సమర్థిస్తూ తణుకుకు ఈఎస్ ఐ ఆసుపత్రి మంజూరు చేయటానికి 100 శాతం కృషి చెయ్యాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.