కొనుగోలును వేగవంతం చేసి రైతులు సంతృప్తి చెందే స్థాయిలో సేవలు అందించాలి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తణుకు మండలం దువ్వ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింటు కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. మీకు సకాలంలో గోనెసంచులు ఇచ్చారా, సంబంధిత అధికారులు, సిబ్బంది మీ వద్దకు వచ్చారా, ధాన్యం డబ్బులు జమ అయ్యాయా అడగగా బాగున్నాయి అని రైతులు చెప్పడంతో జిల్లా జాయింటు కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరను పొంది ఆర్థికంగా బలపడాలని రైతులను జిల్లా జాయింటు కలెక్టరు సూచించారు. కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమ శాతం, రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీలను జిల్లా జాయింటు కలెక్టరు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించుకుని రైతులకు మంచి సేవలు అందించాలని అన్నారు. రైతు తమకు ఇష్టం వచ్చిన రైసు మిల్లులకు తమ యొక్క ధాన్యాన్ని తరలించుకుని విక్రయించుకునే వెసులు బాటు ఉందన్నారు. రైతుసేవా కేంద్రాలలో సరిపడినన్ని గోనేసంచులను సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులకు వారి పంట దిగుబడి తగ్గట్టుగా వారు కోరిన గొనేసంచులను అందజేయాలన్నారు. రైతు తను పండించిన పంటను రైతు సేవాకేంద్రాలు ద్వారా ధాన్యాన్ని అమ్ముకుని గిట్టుబాటు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని, ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తహాశీల్దారు డి.వి.యస్. అశోక్ వర్మ, రెవిన్యూ, వ్యవసాయ, సివిల్ సప్లై, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.