గ్రంథాలయ వారోత్సవ పోటీలలో భాగంగా నవంబర్ 20వ తేదీ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభలో ముఖ్యఅతిథిగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తణుకు పురుషుల గ్రంథాలయంలో జరిగిన వివిధ పోటీ విభాగాల్లో అత్యధికంగా బాలుర ఉన్నత పాఠశాల నుండి బహుమతులు కైవసం చేసుకున్నారనీ, పాటల పోటీలు పేపర్ క్రాఫ్ట్స్ వ్యాసరచన డ్రాయింగ్ కథల పోటీల యందు దేవిశ్రీ, అరవిందు, రామ్ చరణ్, తేజశ్రీ, సుమలత, శృతి, సాయి మోహన్, గీతా శ్రీలక్ష్మి విజేతలుగా నిలిచి బహుమతులు పొందారని పద్మావతి వెల్లడించారు.